లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు బాకీ కార్డులతో పూజలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆ హామీలను అమలు చేస్తామని చెప్పి
1000 రోజులు పూర్తవుతున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో అనేక హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల ద్వారా ఎంత మేర బాకీ పడిందో ప్రజలకు తెలియజేస్తూ, ఇచ్చిన హామీలను ఇకనైనా నెరవేర్చాలని కోరుతూ BRS పార్టీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు.
లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ ఉన్న హామీలు, ప్రయోజనాలను సూచించే “బాకీ కార్డులకు” ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు రావాల్సిన ప్రయోజనాలను వెంటనే అందించాలని ఆ బుద్ది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి కి ప్రసాదించాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు BRS చేపట్టిన “బాకీ కార్డుల పూజ” కార్యక్రమంలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు తదితర వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజల ముందుంచారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

























