ఈ నెల 2న సబ్-జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్-జూనియర్ బాలికల జిల్లా సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక కోసం ఎంపిక ట్రయల్స్ నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి.ప్రభాకర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి. మర్కంటి గంగామోహన్ తెలిపారు. ఈ ఎంపిక ట్రయల్స్ ఈ నెల 2వ తేదీన ఉదయం 8:00 గంటలకు సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల సుద్దపల్లి క్రీడామైదానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికలో పాల్గొని క్రీడాకారులు01-01-2012 తర్వాత జన్మించి ఉండవలెను. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 8 గంటలకు సాఫ్ట్ బాల్ జిల్లా కోచ్ లు మౌనిక, అనికేత్ జోష్ణ లకు రిపోర్ట్ చేయగలరు.























