భీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి కుంటలను పరిశీలించిన జిల్లా అధికారి సాయన్న…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీ సాయన్న భీంగల్ మండలంలోని బడా భీంగల్, పెద్దమ్మకాడి తండా గ్రామాలను సందర్శించినారు. ఈ సందర్శనలో భాగంగా గ్రామంలో కమ్యూనిటీ ఇంకుడు గుంతను పరిశీలించారు
పెద్దమ్మ కాడి తండాలో రైతు పొలంలో నిర్మిస్తున్న వ్యవసాయ నీటి కుంట పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామపంచాయతీ దగ్గర నిర్మించిన వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ను, కమ్యూనిటీ ఇంకుడు గుంతను పరిశీలించడం జరిగింది.
ఆదర్శ గ్రామం కాన్సెప్ట్ లో భాగంగా పెద్దమ్మకాడి తండ గ్రామాన్ని రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ కోరినారు.
ఐకెపి సిబ్బందితో శ్రీనిధి , బ్యాంకు లింకేజీ పురోగతిపై సమీక్ష జరిపినారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, ఏపీఎం ప్రమీల ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్ టెక్నికల్ అసిస్టెంట్లు ,ఐకెపి సీనియర్ సిసిలు శ్రీనివాస్, నరేష్, సంబంధిత గ్రామ సర్పంచులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

























