Homeడిచ్ పల్లి మండల్భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ జట్టుకు జిల్లా క్రీడాకారిణులు దయ్యాల లిఖిత, ఇర్నాల వర్షిణి ఎంపిక...

భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ జట్టుకు జిల్లా క్రీడాకారిణులు దయ్యాల లిఖిత, ఇర్నాల వర్షిణి ఎంపిక…

భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ జట్టుకు జిల్లా క్రీడాకారిణులు

దయ్యాల లిఖిత, ఇర్నాల వర్షిణి ఎంపిక…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్: భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల జట్టుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, సుద్దపల్లికి చెందిన దయ్యాల లిఖిత, ధర్మారం (బి) సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన ఇర్నాల వర్షిణి భారత జట్టులో స్థానం సంపాదించారు.

జూలై 24, 25 తేదీల్లో మహారాష్ట్రలోని సంజీవని యూనివర్సిటీ, కోపర్‌గావ్‌లో నిర్వహించిన తొలి దశ సెలెక్షన్ ట్రయల్స్‌లో దయ్యాల లిఖిత, ఇర్నాల వర్షిణి చక్కటి ప్రతిభ కనబరిచి ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయ్యారు. అనంతరం ఆగస్టు 24, 25 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించిన రెండో దశ సెలెక్షన్ ట్రయల్స్‌లోనూ తమ ప్రతిభను కొనసాగించి ప్రాబబుల్స్ జట్టులో స్థానం సంపాదించారు.

ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు మహారాష్ట్రలోని సంజీవని యూనివర్సిటీ, కోపర్‌గావ్‌లో నిర్వహించిన తొలి శిక్షణ శిబిరంలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల తుది జట్టుకు ఎంపికయ్యారని జోనల్ ఆఫీసర్ యుగంధర లక్ష్మి తెలిపారు.

అలాగే, అక్టోబర్ 5 నుంచి 10వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో నిర్వహించనున్న తుది శిక్షణ శిబిరంలో క్రీడాకారిణులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం అక్టోబర్ 12 నుంచి 18వ తేదీ వరకు చైనాలోని వెయిహైలో నిర్వహించనున్న సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల ఏషియా కప్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భారత జట్టుకు ఎంపికైన జిల్లా క్రీడాకారిణులు దయ్యాల లిఖిత, ఇర్నాల వర్షిణిలను ఘనంగా సన్మానించి అభినందించారు. జిల్లా క్రీడాకారిణులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులోనూ జిల్లాలోని మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జోనల్ ఆఫీసర్ యుగంధర లక్ష్మి, కళాశాల ప్రిన్సిపల్ టి. నళిని, వైస్ ప్రిన్సిపల్ స్వప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ వనిత, పీడీ జ్యోత్స్న, పీఈటీ నర్మదా, సాఫ్ట్‌బాల్ అకాడమీ కోచ్ వేముల మౌనిక, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు…

0
సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ లో పేదలసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: ఎమ్మెల్యే భూపతి రెడ్డి.375 మందికి ఇందిరమ్మ...

రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం…

0
రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం *ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో రక్తం అందజేత* *ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలోఆపరేషన్ నిమిత్తమై బోయ...

వైద్య పరికరాల ధరలపై నియంత్రణ…

0
వైద్య పరికరాల ధరలపై నియంత్రణ... _న్యూఢిల్లీ సెప్టెంబరు 20: ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు వాడే ఐవీ సెట్లు, సిరెంజిలు తదితర వైద్య పరికరాల ఉత్పత్తి ఖర్చులు, అమ్మకం ధరల మధ్య భారీ వ్యత్యాసం...

ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్న చర్య…

0
ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్న చర్య... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడితండాలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పంచాయతీ ఆధ్వర్యంలో గణేష్...

భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు…

0
భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ తరఫున...

Translate »
error: Content is protected !!