ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా బహుజన విద్యార్థి మూమెంట్ సంఘం ఆవిర్భావం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
హైదరాబాద్ లోని ప్రముఖ ఉస్మానియా విశ్వ విద్యాలయం: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి,సబ్బండ వర్గాల విద్యార్థి సంక్షేమం కోసమే ఈ బహుజన విద్యార్థి మూమెంట్ సంఘం ఆవిర్భవించడం జరుగుతుంది తెలంగాణలోగాని భారత దేశంలోగానీ ఎన్నో విద్యార్థి సంఘాలు ఉన్నాయి ఏర్పడుతున్నాయి వారి వారి వెసులుబాటుకి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి కూడ అలాగే రాష్ట్రంలోగానీ దేశంలోగాని ఒక నూతన ఒరవడికను సృష్టించి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుండి రావాల్సిన ఫీజ్ రీయంబర్స్ మెంట్ బకాయిలు,స్కాలర్ షిప్స్,నాణ్యమైన వసతితో కూడిన వసతి గృహాలు మరియు వ్యవస్థలో ఎన్నో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న ప్రైవేట్ స్కూల్స్,ప్రైవేట్ కాలేజీలు,ప్రైవేట్ యూనివర్సిటీలలలో సామాన్యుడికి ప్రాధాన్యం ఇస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేసే విధంగా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అలాగే అసమానతలు లేని సమాజం,అంటారని తనంనిర్మూలన,మూఢనమ్మకాల నిర్మూలన,శాస్త్రీయ దృక్పథంతో అందరికీ సమాన గౌరవం, అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తూ నవ యుగ సమాజ నిర్మాణానికి కృషి చేస్తుంది.ఈ సంఘం 7 గురు ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వంచే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అధ్యక్షుడిగా బాన్సువాడ వేదాంత్ మౌర్య,ఉపాధ్యక్షులుగా దుబ్బాక శివకళ్యాణి,ప్రధాన కార్యదర్శిగా మద్దెల సందీప్,జాయింట్ సెక్రటరీగా మహమ్మద్ లతీఫ్,ట్రెజరరీగా నేనావత్ ప్రవీణ్ కార్యవర్గ సభ్యులుగా దుర్గాప్రసాద్,నవీన్ మరియు లీగల్ అడ్వైజర్ పానుగంటి ప్రవీణ్ గార్లతో ఈ సంఘాన్ని లీగల్ గా స్థాపించడం జరిగింది. ఈ సమావేశంలో బహుజన విద్యార్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బాన్సువాడ వేదాంత్ మౌర్య మాట్లాడుతూ రాగ ద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కరూ వారి వారి సిద్ధాంతాలను గౌరవించాలని అదేవిధంగా పనిచేయాలని సూచిస్తూ ఈ సంఘం మహనీయుల ఆలోచన,మేధావుల జ్ఞానాన్ని శాస్త్రీయ దృక్పథం అమలుకై అవగాహన కల్పిస్తూ నిష్పాక్షికంగాప్రజలవైపు విద్యార్థులవైపు బాధితులవైపు నిజాం వైపు నిలబడి పోరాడాలని ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని భవిష్యత్తుల్లో భావ స్వారూప్యత కలిగిన విద్యార్థి సంఘలతో,ప్రజలబాగుకోరే రాజ్యాకియ పార్టీలతో నికార్సైన ప్రజా నాయకులతో కలసి పనిచేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సమ సమాజ స్థాపన కోసం కృషి చేయడమే మా ధ్యేయమని ప్రజలను అవగాహన కల్పిస్తూ పనిచేస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో సందీప్,అంజన్ కుమార్,నవీన్,శ్రీశైలం,లోకేష్,రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు స్కాలర్స్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.























