కామారెడ్డిలో వినాయక నిమజ్జనానికి క్రేన్లు ప్రారంభించిన మిన్సిపల్ చైరపర్సన్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రేన్లను ప్రారంభించారు.
రెండు రోజుల పాటు జరిగే నిమజ్జన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేపట్టారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిమజ్జన సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించాలని కోరారు.
సిగ్నళ్ల వద్ద, ప్రధాన రహదారుల్లో రద్దీ లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.
నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
అనంతరం కొబ్బరికాయ కొట్టి క్రేన్లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు వైస్ చైరపర్సన్ కమిషనర్ పాల్గొన్నారు.

























