డిచ్ పల్లి మండలం లాల్లో ఎమ్మెల్యే పరామర్శలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నినామాబాద్ రూరల్,డిచ్ పల్లి మండలాల్లో ఎమ్మెల్యే పరామర్శలు. పలు కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి.నిజామాబాద్ రూరల్ మండలం కేశాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ కీ || శే. గ్రామంలో మాజీ సర్పంచ్.గంగారెడ్డి కుటుంబాన్నిపరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కీ|| శే సీ.హెచ్. బుచ్చారెడ్డి కుటుంబసభ్యులనుపరామర్శించారు.ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.డిచ్ పల్లి మండలం నడిపల్లి గ్రామంలో వార్డు సభ్యులు విజయకాంత్ కు ఇటీవల పితృవియోగం తో పాటు వారి సోదరుడు మరణించగా వారి నివాసానికి ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు.అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతితెలియజేశారు.అనంతరం రాంపూర్(డి) గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు. విజయ్ కి ఇటీవల పితృవియోగం కలుగుగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సీరం నర్సయ్య కు ఇటీవలమాతృవియోగం కలుగుగా వారి నివాసానికి వెళ్లిఎమ్మెల్యేపరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ధైర్యంగా ఉండాలనిఅభయమిచ్చారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అటు బీబీపూర్ తాండా లో ఇటీవల మరణించిన కాట్రోత్ తారసింగ్ కుటుంబ సభ్యులనుపరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.అంబర్ సింగ్,నాయకులు పొలసాని.శ్రీనివాస్,అమృతాపూర్ గంగాధర్,తారాచంద్, ఉమ్మాజి.నరేష్,రాంచందర్ గౌడ్,ధర్మగౌడ్,రూరల్ మండల అధ్యక్షులు. జనార్దన్,మోహన్,ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

























