గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు
420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
శోభాయాత్ర సందర్భంగా 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర ఐపిఎస్ తెలిపారు.
శోభాయాత్ర సాగే మార్గంలో 162 సీసీ కెమెరాలు, మూడు డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
ట్రాఫిక్ రద్దీ ఏర్పడే ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపించేలా చర్యలు చేపట్టారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో భక్తులు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.
శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అందరూ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.

























