Homeతెలంగాణతెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల శిక్షణ శిబిరం...

తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల శిక్షణ శిబిరం…

తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల శిక్షణ శిబిరం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

ప్రారంభం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలి: గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ఇటీవల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన బాలుర నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో జరిగిన బాలికల రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు శిక్షణ శిబిరం బుధవారం ఉదయం కమ్మర్‌పల్లి గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియంలో ప్రారంభమైంది.శిక్షణ శిబిరం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమ్మర్‌పల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు కమ్మర్‌పల్లికి వచ్చి శిక్షణ పొందడం ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులకు అవసరమైన భోజన,వసతి సౌకర్యాలు కల్పించేందుకు సహకరిస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక,మానసిక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు.ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని ఆమె సూచించారు.ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి.మర్కంటి గంగా మోహన్ మాట్లాడుతూ..ఈ నెల 27 నుండి 30 వరకు మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరిగే జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర బాల, బాలికల జట్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేస్తామని తెలిపారు.రాష్ట్ర జట్లకు మెరుగైన శిక్షణ అందించేందుకు నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరం ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అశోక్,జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు.బి.మల్లేష్ గౌడ్,జెడ్.పి.హెచ్.ఎస్. కమ్మర్‌పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న,ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం,జగిత్యాల జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి. వెంకటేష్,సీనియర్ క్రీడాకారులు విక్రమ్,కోచ్‌లు అనికేత్,నరేష్,రాహుల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ శిక్షణశిబిరాన్నిసద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి…

0
గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు రూట్ మ్యాప్ పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: నగరంలో నిర్వహించే గణపతి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు...

అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష…

0
అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష... ఇందూరు: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి సంబంధిత...

ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు…

0
ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర...

గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు…

0
గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని...

తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు…

0
తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు సీపీ సాయి చైతన్యకు బాధిత కుటుంబాల ఫిర్యాదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో 49 కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)...

Translate »
error: Content is protected !!