పెద్దబజార్ మసీదు వద్ద భారీ బందోబస్తు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి, సెప్టెంబర్ 23: గణేశ్ నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలోని పెద్దబజార్ మసీదు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులను మోహరించారు.
నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
గణేశ్ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు బందోబస్తు కొనసాగించనున్నట్లు పోలీసులు తెలిపారు.

























