ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా గణనాథుని లడ్డూ వేలంపాటను ఘనంగా నిర్వహించారు.
తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు అందుకున్న గణనాథుని లడ్డూను వేలం వేశారు. ఈ వేలంపాటలో ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ చీఫ్ సూపరింటెండెంట్ మూత రాజ్‌కుమార్ దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పోటాపోటీగా సాగిన వేలంలో గణనాథుని లడ్డూను రాజ్‌కుమార్ దంపతులు రూ.16,550లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు రాజ్‌కుమార్ దంపతులను అభినందించారు.
గణనాథుడి ఆశీస్సులు రాజ్‌కుమార్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, భక్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

























