రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొననున్న కోనాసముందర్ విద్యార్థులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్ పాఠశాల నుండి విద్యార్థులు 6 గురు ఎంపిక అయ్యారు.
వీరు నిజామాబాద్ జిల్లా తీర్మాన్పల్లి గ్రామంలో జరిగిన జిల్లాస్థాయిలో నెట్ బాల్ క్రీడా పోటీల్లో అత్యంత ప్రతిభా కనబరిచి అండర్ 16 – బాలురా విభాగంలో M.శివగౌడ్ , బాలికల విభాగంలో G. రాజవర్ధిని,N.నికిత
అండర్ -19 బాలుర విభాగంలో N. పవన్
బాలికల విభాగంలో B. వెన్నెల,B. సంజన రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది. వచ్చే అక్టోబర్ నెలలో 10,11,12 తేదీలలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అండర్ 16 క్రీడాకారులు పాల్గొంటారని అలాగే అండర్ 19 ఎంపికైన క్రీడాకారులు హైదరాబాదులోని శామీర్ పేట లో అక్టోబర్ నెలలో 13.14,15 తేదీలలో రాష్ట్రస్థాయిల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయుడు B. రమేష్ గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపికైన క్రీడాకారులను , వ్యాయామ ఉపాధ్యాయుడు B. రమేష్ గౌడ్ ను ప్రధానోపాధ్యాయులు B. మధు పాల్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం, క్రీడాకారుల తల్లిదండ్రులు, అభినందించడం జరిగింది.

























