ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి ని పరిశీలించిన వినయ్ రెడ్డి.
డయాలసిస్ వార్డ్ ను సందర్శన…
ఆర్మూర్ పట్టణం లో ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించి ఆసుపత్రి లోని ఇబ్బందులను,కావలసిన పరికరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఆసుపత్రి సూపరిఇండెంట్ డా|| ప్రమిద,అమృత్ రాం రెడ్డి ఆసుపత్రి లో మాట్లాడుతూ రేడియాలజీ డాక్టర్ ని,స్టాఫ్ నర్సులను మరియు X రే మెషీన్ లను కావాలని కోరడం జరిగింది. దీనికి సంబంధించిన మంత్రి తో మాట్లాడి వెంటనే మంజూరు చేపిస్తానని హామీ ఇవ్వడం ఇవే కాకుండా ఆసుపత్రికి సంబంధించిన రోగులను చూడటానికి వచ్చిన బంధువులకు కుర్చొవడానికి షేడ్ నిర్మించాలని, బోర్ సరిగ్గా పని చేయడం లేదని చెప్పారు.
వినయ్ కుమార్ రెడ్డి వెంటానే మున్సిపల్ చైర్మన్ లహరి రఘు కి చెప్పి ఆసుపత్రి లో బోర్ మోటార్ బిగించాలని చెప్పారు. అదేవిధంగా త్వరలో షేడ్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోనెలహరి రఘు మున్సిపల్ కౌన్సిల్లో ఉపేందర్ నవీన్ చాలా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ రవీందర్ రెడ్డి రాకేష్ సాయి పాల్గొన్నారు

























