ధర్పల్లిలో మోడల్ కళాశాల విద్యార్థుల క్షేత్రస్థాయి పరిశీలన…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని పీఎం శ్రీ మోడల్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులు వృత్తి విద్య, ఇంటర్న్‌షిప్ కోర్సులో భాగంగా బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
ఈ సందర్భంగా ధర్పల్లిలోని ఐటీ ఇన్స్టిట్యూట్తో పాటు నిజామాబాద్‌లోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను విద్యార్థులు సందర్శించి, అక్కడి విధానాలను పరిశీలించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు.
విద్యార్థులకు ప్రత్యక్ష వృత్తి అనుభవాన్ని అందించడంతో పాటు, ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పెంపొందించడమే ఈ క్షేత్రస్థాయి పరిశీలన ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పది రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రుతి, నవ్యశ్రీ పాల్గొన్నారు.

























