తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం
టీఎస్ఏ హైబ్రిడ్ అకౌంట్ విధానం, ఖాతాల నిర్వహణపై అవగాహన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా టీఎస్ఏ హైబ్రిడ్ అకౌంట్ విధానం అమలు, ఖాతాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని ప్రోగ్రామ్ ఆఫీసర్లకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఖాతాల నిర్వహణ, నిధుల వినియోగం చేపట్టాలని పేర్కొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. అపర్ణ మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణకు ప్రోగ్రామ్ ఆఫీసర్ల మధ్య సమన్వయం, బాధ్యతాయుతమైన నిర్వహణ ఎంతో ముఖ్యమని తెలిపారు.
ముఖ్య శిక్షకుడిగా పాల్గొన్న రాష్ట్ర ఎన్ఎస్ఎస్ సెల్ డిప్యూటీ స్టేట్ ఆఫీసర్ (DySO) జి. నర్సింహ గౌడ్ టీఎస్ఏ హైబ్రిడ్ అకౌంట్ విధానంలోని వివిధ ప్రక్రియలు, ఖాతాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగానికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రోగ్రామ్ ఆఫీసర్లు పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ సమావేశంలో వివిధ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

























