అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు
ప్రమాదంలో జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ధర్పల్లి పోలీసులు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామానికి చెందిన జిందం వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
వంశీ తండ్రి జిందం శ్రీనివాస్ TS16EX7806 నంబర్ గల స్కూటీపై గోవిందపల్లి గ్రామంలోని ఉరలమ్మ విగ్రహం వద్ద ఆపి నిలబడి ఉన్నారు. ఈ సమయంలో రామడుగు గ్రామం వైపు నుంచి లిటిల్ ఆర్ట్స్ స్కూల్‌కు చెందిన TS16UB9598 నంబర్ గల బస్సును డ్రైవర్ ఎం.డి. హైమద్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి స్కూటీని ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో జిందం శ్రీనివాస్‌కు తలకు రక్తగాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఫిర్యాదుదారుడు జిందం వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్పల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

























