డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష
అత్యవసర సేవలను అనవసరంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: జక్రాన్‌పల్లి ఎస్ఐ జి. మహేశ్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి గ్రామానికి చెందిన కటకం అశోక్ అనే వ్యక్తి మద్యం సేవించి అత్యవసర పోలీస్ సేవల కోసం ఏర్పాటు చేసిన డయల్ 112కు అనవసరంగా కాల్ చేసి సేవలను దుర్వినియోగం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అతనిపై కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో అక్టోబర్ 30, 2026న సదరు వ్యక్తిని ఆర్మూర్‌లోని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తి అతనికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు.
ఈ సందర్భంగా జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి. మహేశ్ మాట్లాడుతూ.. డయల్ 112 అనేది అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందేందుకు ఏర్పాటు చేసిన సేవ అని తెలిపారు. ఈ సేవలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు డయల్ 112 సేవలను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

























