మోపాల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలపై అవగాహన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోపాల్ ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులను పోలీస్ స్టేషన్కు ఆహ్వానించి, పోలీస్ శాఖ పనితీరు, విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాల పనితీరు, కమ్యూనికేషన్ వ్యవస్థ, పోలీసుల విధులు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రతో పాటు ప్రజలకు పోలీస్ శాఖ అందించే వివిధ సేవలను విద్యార్థులకు వివరించారు.
అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు పోలీస్ అధికారులు సమాధానాలు ఇచ్చి, పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరించారు.
విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటన ద్వారా ప్రాయోగిక జ్ఞానాన్ని అందించడం, పోలీస్ శాఖ విధులు, ప్రజా సేవలు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

























