Homeఇందూరుకళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు...

కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు…

కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు

జిల్లా స్థాయి యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

ఇందూరు: కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువతను వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తోందన్నారు. ముఖ్యంగా ‘మై భారత్’ కార్యక్రమం ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవాభావం పెంపొందించేలా కృషి చేస్తోందని తెలిపారు.

యువతలో విద్య, నైపుణ్యం, క్రీడా స్ఫూర్తి, సామాజిక బాధ్యత, దేశభక్తి వంటి లక్షణాలు అలవడాలని ఆకాంక్షించారు. ఇలాంటి పోటీల ద్వారా యువత తమ ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుందన్నారు. క్రీడాకారులు, యువ కళాకారులకు తన ట్రస్ట్ ద్వారా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

ఇందూరులో పెండింగ్‌లో ఉన్న కళాభారతి, క్రీడా స్టేడియం నిర్మాణాలను పూర్తి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ అంశాలను ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన యువత రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణించి ఇందూరు ఖ్యాతిని చాటాలని పిలుపునిచ్చారు.

యువత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ కళలు, క్రీడల్లో ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు.

అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన యువతీ యువకులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి రమేష్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపర్ణ, బాలభవన్ సూపరింటెండెంట్ ఉమాబాల, న్యాయనిర్ణేతలు పుష్ప, శ్వేతారెడ్డి, సిర్ప లింగం, కోకిల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ…

0
జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు  నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను స్మరిస్తూ...

ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ…

0
ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I ఆధ్వర్యంలో (నవంబర్ 5) రేపు నిర్వహించనున్న ఎన్ ఎస్ ఎస్-టీ7 సెవెన్ ఓవర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను...

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు!

0
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు! పేకాట ఆడినా.. ఆడించినా చట్టపరమైన చర్యలు తప్పవు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పేకాట స్థావరాలపై ప్రత్యేక బృందాలతో నిఘా.. సమాచారం తెలిస్తే...

తెలంగాణ యూనివర్సిటీలో రేపు ‘వికసిత్ భారత్ యువ సంవాద్ – 2026…

0
తెలంగాణ యూనివర్సిటీలో రేపు ‘వికసిత్ భారత్ యువ సంవాద్ – 2026’ యువతలో ప్రజాస్వామ్య విలువలు, పౌర బాధ్యతలు, నాయకత్వ లక్షణాలపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్, నవంబర్ 4: తెలంగాణ విశ్వవిద్యాలయంలో నవంబర్...

ఏటీఎంలో నకిలీ నోటు కలకలం!

0
ఏటీఎంలో నకిలీ నోటు కలకలం! రూ.24 వేల నగదు డ్రా చేయగా.. రూ.500 నకిలీ నోటు వచ్చినట్లు బాధితురాలి ఆరోపణ ఏటీఎం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ధరణి డిమాండ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: నిజామాబాద్...

Translate »
error: Content is protected !!