సంగమేశ్వరులో వివాహిత అనుమానాస్పద మృతి!
మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళ మృతి
తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దోమకొండ పోలీసులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాలమడుగు మౌనిక (33) ఇంట్లో మృతి చెందింది.
మౌనికకు పాలమడుగు రాజారెడ్డితో వివాహం కాగా, వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గత నాలుగేళ్లుగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యంలో మెరుగుదల కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
గత ఏడాది నుంచి మౌనిక తన తండ్రి నాయిని మధుసూదన్‌రెడ్డి ఇంట్లో నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయాన్ని గుర్తించిన పొరుగింటి మహిళ కీర్తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మౌనిక మృతి చెందినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. మౌనిక మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని ఫిర్యాదుదారుడు పేర్కొన్నట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. ఘటనపై చట్టప్రకారం దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

























