Homeకామారెడ్డి జిల్లాజూదం, పేకాట నిర్మూలనకు ప్రత్యేక పోలీస్ బృందాలు!

జూదం, పేకాట నిర్మూలనకు ప్రత్యేక పోలీస్ బృందాలు!

జిల్లావ్యాప్తంగా 24 గంటల నిఘా.. జూదం నిర్వాహకులు, పాల్గొనేవారిపై కఠిన చర్యలు

జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర ఐపీఎస్ హెచ్చరిక…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి: జిల్లాలో జూదం, పేకాట కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు జిల్లావ్యాప్తంగా 24 గంటల పాటు నిఘా కొనసాగిస్తూ, జూదం స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించనున్నాయి.

జూదం నిర్వహించే నిర్వాహకులతో పాటు పేకాటలో పాల్గొనే వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో జూదానికి అలవాటుపడి ఎంతోమంది తమ కష్టార్జితాన్ని కోల్పోయి అప్పులపాలవుతున్నారని తెలిపారు. జూదం కారణంగా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, కలహాలు ఏర్పడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జూదం కేసుల్లో పట్టుబడితే పోలీస్ రికార్డుల్లో నేర చరిత్ర నమోదయ్యే అవకాశం ఉందని, ఇది భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోలీస్ వెరిఫికేషన్‌పై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. అవసరమైతే దర్యాప్తులో భాగంగా నిందితుల వేలిముద్రలను కూడా సేకరిస్తామని వెల్లడించారు.

జిల్లాలో ఎక్కడైనా పేకాట నిర్వహిస్తున్నా, జూదం కార్యకలాపాలు కొనసాగుతున్నా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712686133 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

జూదం, పేకాట నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం…

0
మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ -1,డిపో లో నల్ల బ్యాడ్జ్ లతో నిరసన తెలియజేస్తూ ఆమె మృతికి నివాళలు అర్పించారు.ఈ నిరసన కారుక్రమంలో ఐక్య కూటమినాయకులు,ఎంప్లాయిస్...

ధర్పల్లి పీఎంశ్రీ పాఠశాలలో రెండు కుట్టుమిషన్లు ప్రారంభం…

0
ధర్పల్లి పీఎంశ్రీ పాఠశాలలో రెండు కుట్టుమిషన్లు ప్రారంభం. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన రెండు కుట్టుమిషన్లను...

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీలో కామారెడ్డికి చోటు…

0
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీలో కామారెడ్డికి చోటు సభ్యుడిగా ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా...

తెలంగాణ యూనివర్సిటి లో ఇంటర్ కళాశాలల చెస్ (మెన్) టోర్నీ విజేతలకు మెడల్,సర్టిఫికట్స్ ప్రదానం…

0
తెలంగాణ యూనివర్సిటి లో ఇంటర్ కళాశాలల చెస్ (మెన్) టోర్నీ విజేతలకు మెడల్,సర్టిఫికట్స్ ప్రదానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఈ రోజు ఉదయం 11. 00 గంటలకు యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల మినీ సెమినార్...

తెలంగాణ యూనివర్సిటీలో బీటెక్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల…

0
తెలంగాణ యూనివర్సిటీలో బీటెక్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల 70 మంది విద్యార్థులకు గాను 38 మంది ఉత్తీర్ణత.. 30 మంది ప్రమోట్, ఇద్దరు డిటైన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని...

Translate »
error: Content is protected !!