Homeతెలంగాణతెలంగాణ యూనివర్సిటీలో బీటెక్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల...

తెలంగాణ యూనివర్సిటీలో బీటెక్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల…

తెలంగాణ యూనివర్సిటీలో బీటెక్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

70 మంది విద్యార్థులకు గాను 38 మంది ఉత్తీర్ణత.. 30 మంది ప్రమోట్, ఇద్దరు డిటైన్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల 2025 బ్యాచ్ బీటెక్ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేశారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరితో కలిసి ఫలితాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. సంపత్ కుమార్ ఫలితాల వివరాలను వెల్లడించారు.

బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 56 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 28 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 29 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, వారిలో 11 మంది పురుషులు, 18 మంది మహిళలు ఉన్నారు. మరో 25 మంది విద్యార్థులు ప్రమోట్ కాగా, వారిలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు పురుష విద్యార్థులు డిటైన్ అయ్యారు.

బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో మొత్తం 14 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, వారిలో ఇద్దరు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. మరో ఐదుగురు విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. వీరిలో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.

మొత్తంగా రెండు విభాగాల్లో కలిపి 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 38 మంది ఉత్తీర్ణత సాధించారు. మరో 30 మంది విద్యార్థులు ప్రమోట్ కాగా, ఇద్దరు విద్యార్థులు డిటైన్ అయ్యారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (పీజీ) డాక్టర్ టి. సంపత్ కుమార్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఆరతి, డాక్టర్ నందిని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి పీఎంశ్రీ పాఠశాలలో రెండు కుట్టుమిషన్లు ప్రారంభం…

0
ధర్పల్లి పీఎంశ్రీ పాఠశాలలో రెండు కుట్టుమిషన్లు ప్రారంభం. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన రెండు కుట్టుమిషన్లను...

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీలో కామారెడ్డికి చోటు…

0
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీలో కామారెడ్డికి చోటు సభ్యుడిగా ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా...

తెలంగాణ యూనివర్సిటి లో ఇంటర్ కళాశాలల చెస్ (మెన్) టోర్నీ విజేతలకు మెడల్,సర్టిఫికట్స్ ప్రదానం…

0
తెలంగాణ యూనివర్సిటి లో ఇంటర్ కళాశాలల చెస్ (మెన్) టోర్నీ విజేతలకు మెడల్,సర్టిఫికట్స్ ప్రదానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఈ రోజు ఉదయం 11. 00 గంటలకు యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల మినీ సెమినార్...

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం!

0
ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం! తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి: వ్యవసాయ విస్తరణ అధికారి డి. స్నేహ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్, నవంబర్ 3:...

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు…

0
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు ముచ్కూర్ చౌరస్తా నుంచి నింబాచల క్షేత్రం వరకు ప్రత్యేక శానిటైజేషన్ పనులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో...

Translate »
error: Content is protected !!