తెలంగాణవిశ్వవిద్యాలయ వెబ్‌సైట్,నెట్‌వర్క్ఇన్‌ఛార్జిగా డా.జి.శ్రీనివాస్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
తెలంగాణ విశ్వవిద్యాలయ వాణిజ్య శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి. శ్రీనివాస్‌ను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్,నెట్‌వర్క్ ఇన్‌ఛార్జిగా నియమించారు. ఉపకులపతి ప్రొఫెసర్ టి. యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం.యాదగిరి ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేశారు.డా.జి.శ్రీనివాస్ గత 18 సంవత్సరాలుగా బోధన,పరిశోధనా రంగాల్లో విశేషసేవలందిస్తున్నారు.ఎం.కాం.(ఈ-కామర్స్)లోవిశ్వవిద్యాలయ ప్రథమ ర్యాంకు సాధించిన ఆయన తెలంగాణవిశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు. జాతీయ,అంతర్జాతీయ పరిశోధనా పత్రికల్లో 25 పరిశోధనా వ్యాసాలను ప్రచురించడంతో పాటు, 74కు పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లలో 40కు పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఆంగ్లం, తెలుగు భాషల్లో 11 పాఠ్యపుస్తకాలను రచించారు. రెండు భారతీయ పేటెంట్లను దాఖలు చేశారు.విద్యా, పరిశోధనా రంగాల్లోఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2022లో విశ్వవిద్యాలయ ఉత్తమ ఉద్యోగి పురస్కారం, 2025లో ప్రొఫెసర్ హెచ్.వి. మెమోరియల్ అవార్డును అందుకున్నారు.డా.జి. శ్రీనివాస్ నియామకం పట్ల యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. రాంబాబు,పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్,చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ కె.రవీందర్ రెడ్డి,టీ యు టీ ఎఅధ్యక్షులు.డా.ఎ. పున్నయ్య,మేనేజ్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ సి.హెచ్. ఆంజనేయులు, డా. ఎస్. గంగాకిషన్,డా.కిరణ్ రాథోడ్,డా.ఎస్. నారాయణతో పాటు వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.























