బెలియా తండా నర్సరీలో 5 వేల మొక్కల పెంపకానికి శ్రీకారం
గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని బెలియా తండాలో విబిజి రాంజీ పథకం కింద ఏర్పాటు చేసిన గ్రామ నర్సరీని మంగళవారం సర్పంచ్ రావుజీ నాయక్, ఉపసర్పంచ్ బాదావత్ పరిశీలించారు.
ఈ సందర్భంగా నర్సరీలో 5 వేల మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. మొక్కలు పూర్తిస్థాయిలో పెరిగిన అనంతరం గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో 5 వేల మొక్కలను నాటాలని గ్రామ ప్రజలకు సూచించారు. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దావాజీ, కార్యదర్శి ప్రవీణ్, కరోబార్ నిఖిల్, టీఏ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

























