రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు ఎంపిక…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు అర్హత70వ స్కూల్ గేమ్స్ అండర్-19 సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపికల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తొర్లికొండ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.అక్టోబర్ 30న సాంఘిక సంక్షేమ గురుకులపాఠశాల,సుద్ధపల్లిలో నిర్వహించిన బాలికల జిల్లా జట్టు ఎంపికల్లో తొర్లికొండ పాఠశాలకు చెందిన కొండ్ర వైష్ణవి.పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. అలాగే నవంబర్ 3న ఆర్మూర్‌లో నిర్వహించిన బాలుర జిల్లా జట్టు ఎంపికల్లో జారుపట్ నరేష్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.ఎంపికైన క్రీడాకారులు బాలికల విభాగంలో నవంబర్ 4 నుంచి 6 వరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని జూనియర్ కళాశాలలో, బాలుర విభాగంలో నవంబర్ 6 నుంచి 8 వరకు హైదరాబాద్‌లోని భవన్స్ అరబిందో జూనియర్ కళాశాలలోనిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలలోపాల్గొననున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు,
జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్,ఉపాధ్యాయ బృందం,గ్రామ సర్పంచ్ పద్మ నాగరాజ్,ఉప సర్పంచ్. తెడ్డు. మైపాల్,గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు.కాటిపల్లి గంగారెడ్డి తెల్లన్న, ఉపాధ్యక్షులు.ఇర్ల బాలయ్య, కార్యదర్శి కన్క రాజేష్,కోశాధికారి వేముల నాగరాజు,గ్రామ నాయకులు,గ్రామ యువకులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించి, రాష్ట్ర స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

























