ధర్పల్లి పీఎంశ్రీ పాఠశాలలో రెండు కుట్టుమిషన్లు ప్రారంభం.
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన రెండు కుట్టుమిషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మురళీధర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం మూడు కుట్టుమిషన్లు ఏర్పాటు చేయగా, ఈ విద్యా సంవత్సరం మరో రెండు నూతన కుట్టుమిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. విద్యార్థులకు వొకేషనల్ కోర్సులో భాగంగా టైలరింగ్ శిక్షణ అందించి, కుట్టుపనిలో నైపుణ్యం పెంపొందించేలా బోధిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

























