జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను స్మరిస్తూ నగరంలోనీ చంద్రశేఖర్ చౌరస్తా నుండి సుభాష్ నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు.కర్క.గణేష్, ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ లు మాట్లాడుతూ,విద్యార్థి అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జెసిఎస్ ప్రసాదును స్మరిస్తూ ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. పిడి ఎస్ యు విద్యార్థి ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జేసిఎస్ ప్రసాద్ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ వాసి కావడం జిల్లా విద్యార్థులకుగర్వకారణమన్నారు.ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి మరణం తర్వాత పి.డి.ఎస్.యు ఉద్యమాన్ని భుజాల ఎత్తుకున్న కామ్రేడ్ జేసిఎస్ ప్రసాద్ ను,అప్పటి ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్య గారిని 1975 నవంబర్ 5న పోలీసులు విజయవాడ బస్టాండ్ వద్ద పట్టుకొని ఖమ్మం చీకటి గండ్ల అడవుల్లో కాల్చి చంపారన్నారు. జార్జిరెడ్డి,జెసిఎస్ ప్రసాదుల ప్రాణ త్యాగాలతో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. వారి ఆశయాల వెలుగులో రంగవల్లి,శ్రీపాద శ్రీహరి, చేరాలు,కోలా శంకర్ లు ఈ విద్యార్థి ఉద్యమానికి ఊపిరిలూదారన్నారు.కేంద్ర రాష్ట్రప్రభుత్వాలుఅవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యాప్రవేటీకరణ,కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడటమే కామ్రేడ్ జేసిఎస్ ప్రసాద్ కు మనమిచ్చే నిజమైన నివాళి అవుతుందన్నారు. ఆ వెలుగులో విద్యార్థి ఉద్యమాన్నినిర్మిస్తామన్నారు.ఈకార్యక్రమంలోపిడిఎస్యు నగర అధ్యక్షులు. నసీర్,నగర ఉపాధ్యక్షులు. సృజన్,నగర నాయకులు మణితేజ,శ్రీశాంత్, భానుప్రియ,సుజాత, అర్చన,లక్ష్మి,లావణ్య, సుప్రియ,సౌజన్య,కళ్యాణి, మమత,వసంత,పుష్ప తదితరులు పాల్గొన్నారు.

























