ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో!
రామడుగు గ్రామంలో హార్వెస్టింగ్ పనుల తనిఖీ
కూలీలు నిర్ణీత కొలతల ప్రకారం పనిచేస్తే రోజుకు రూ.308 కూలి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో వి.బి.జి. రామ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీవో బి. మారుతి పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న హార్వెస్టింగ్ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, కూలీలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీలు నిర్ణీత కొలతల ప్రకారం పనులు పూర్తి చేస్తే రోజుకు రూ.308 కూలి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డులు జారీ చేయాలని, జలసిరి పథకం కింద నీటి సంరక్షణకు అవసరమైన పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో కనీసం 60 మంది కూలీలతో ఉపాధి హామీ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఎం. శ్రీధర్, ఏపీఓ వినోద, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

























