ధర్పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. డీఎల్‌పీఓ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పథకం అమలుకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. 19 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగి, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. అర్హులైన వారు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ కోరారు.

























