క్రీడా పోటీల్లో కృషి హైస్కూల్ విజయభేరి.. ఓవరాల్ ఛాంపియన్‌గా ఘన విజయం
వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు.. మొత్తం 9 షీల్డులు కైవసం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా : భీమ్‌గల్ లో నిర్వహించిన 70వ మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడా పోటీల్లో కృషి హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచారు. వివిధ క్రీడా విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 9 షీల్డులను కైవసం చేసుకున్నారు.
బాలుర జూనియర్, సబ్‌జూనియర్ వాలీబాల్ విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించగా, బాలికల జూనియర్, సబ్‌జూనియర్ వాలీబాల్‌లోనూ ప్రథమ స్థానాలు దక్కించుకున్నారు. బాలికల జూనియర్, సబ్‌జూనియర్ కబడ్డీ, సబ్‌జూనియర్ ఖోఖో విభాగాల్లో ద్వితీయ స్థానాలు సాధించారు. అదేవిధంగా మార్చ్‌పాస్ట్‌లో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు.
వివిధ విభాగాల్లో సాధించిన విజయాలతో పాటు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుని కృషి హైస్కూల్ తమ క్రీడా ప్రతిభను చాటుకుంది. విద్యార్థుల విజయంపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలను అభినందించారు.

























