పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ
నిజామాబాద్ నగరం లోని వినాయక్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు పట్టణ ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న ఆరోగ్య సేవలను హాజరు రిజిస్టర్ ను గర్భిణీ స్త్రీల నమోదును కుక్క కాటు మరియు పాము కాటుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని, అన్ని ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది కలుగకుండా ఆరోగ్య సేవలను అందించాలని సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని అన్నారు. తనిఖీ సమయంలో ఆసుపత్రి వైద్య అధికారి డాక్టర్ శ్రీలత వైద్య సిబ్బంది ఉన్నారు. 




















