ఎండల్లో బయటకు రావొద్దు ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు
ఎండల్లో బయటకు రావొద్దని ప్రజలకు తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్రంలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావొద్దని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. బయటకు వస్తే టోపీ, తలపాగా తప్పనిసరిగా ధరించాలని దిశానిర్దేశం చేశారు.!
ఎండదెబ్బ ప్రమాదమని.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని మంత్రి సీతక్క తెలిపారు. అధికారులు గ్రామాలు, పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ స్థాయిలో తాగునీటి సౌకర్యాలను కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, ఉపాధి హామీ కార్మికులకు ప్రత్యేక సూచనలు చేశారు. పనిస్థలాల్లో తాగునీటి వసతి ఏర్పాటు తప్పనిసరని తెలిపారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పని చేసే ప్రాంతాల్లో ఆయా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కార్మికుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.. KP

























