ఈ 9 పనులు చేస్తానని మాటివ్వండి: మోదీ
ప్రధాని మోదీ కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉన్న ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. 9 పనులు చేస్తామని మాటివ్వాలని ప్రజల నుంచి ప్రధాని హామీలు తీసుకున్నారు. అమ్మ పేరుతో మొక్క నాటాలని, నీటి సంరక్షణ చేపట్టాలని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, తృణధాన్యాలు తీసుకోవాలని, నూనె పదార్థాలు తగ్గించాలని, ప్రకృతి వ్యవసాయం చేయాలని, జనసంచారం, మతపరమైన ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని, స్థానిక పర్యటక ప్రాంతాలను ప్రోత్సహించాలని కోరారు••£























