Homeఆరోగ్యంజర్నలిస్టుల కుటుంబాలకు ‘వెల్నెస్’ భరోసా నిజామాబాద్‌లో ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ!

జర్నలిస్టుల కుటుంబాలకు ‘వెల్నెస్’ భరోసా నిజామాబాద్‌లో ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ!

*జర్నలిస్టుల ఆరోగ్యానికి ‘వెల్నెస్’ భరోసా!*

*నగర ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డుల పంపిణీ*

*ముఖ్య అతిథులుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ కవితా రెడ్డి.**

*జర్నలిస్టుల సంక్షేమానికి వెల్నెస్ హాస్పిటల్ ముందడుగు.*
*రాష్ట్రవ్యాప్తంగా 8 బ్రాంచ్‌లతో కార్పొరేట్ వైద్యం: ఎండీ అసద్. సుమన్ గౌడ్**

నిజామాబాద్ సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు వెల్నెస్ హాస్పిటల్ అండగా నిలిచింది. బుధవారం నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో నిజామాబాద్ నగర ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి (DPRO) పద్మశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

*ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: శ్రీనివాస్ రెడ్డి**

ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వృత్తి రీత్యా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జర్నలిస్టుల కుటుంబాల కోసం ఉచిత హెల్త్ కార్డులు పంపిణీ చేయడం అభినందనీయమని వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యాన్ని కొనియాడారు. ప్రభుత్వం జారీ చేస్తుందా అట్రిడిటేషన్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా, ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా, అందరికీ కార్డులు అందేలా రాష్ట్ర కమిటీ, ప్రభుత్వంతో మాట్లాడటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు..

*డాక్టర్ కవితా రెడ్డి* *మాట్లాడుతూ..*

వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండాలని, జర్నలిస్టులకు కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించడం శుభపరిణామమని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

*విస్తరిస్తున్న వెల్నెస్ సేవలు: ఎండీ అసద్**

ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అసద్ మాట్లాడుతూ.. 2018లో అమీర్‌పేటలో మొదటి బ్రాంచ్‌తో ప్రారంభమైన వెల్నెస్ హాస్పిటల్, నేడు రాష్ట్రవ్యాప్తంగా 8 బ్రాంచ్‌లతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఈ హెల్త్ కార్డుల ద్వారా అత్యుత్తమ చికిత్సలు పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు.

*అట్టహాసంగా కార్యక్రమం..**

ఈ కార్యక్రమంలో వెల్నెస్ ఆసుపత్రి ప్రతినిధులు సుమన్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ భార్గవ్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగర ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్, క్యాషియర్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు, ఉపాధ్యక్షులు సంగీత, సతీష్, గోవింద రాజులు, సురేష్ తదితరులు అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరో చీఫ్‌లు, స్టాఫ్ రిపోర్టర్లు, ఎడిటర్లు, ఫోటో మరియు వీడియో జర్నలిస్టులు, నగర జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని హెల్త్ కార్డులను అందుకున్నారు.

> **జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం:**

> ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. 

సంఘాలకు అతీతంగా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, జర్నలిస్టులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన తన వాగ్దానాన్ని పూర్తి చేశారని, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, దీనికి సహకరించిన వెళ్లే ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలనని భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం…

0
మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్. కే నగేష్ ... నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మోర్తాడ్ మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైరవిహారం...

బడా భీంగల్‌లో యూరియా కోసం రైతుల ధర్నా…

0
బడా భీంగల్‌లో యూరియా కోసం రైతుల ధర్నా... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ బడా భీంగల్, ఆగస్టు 27: పంటలను కాపాడుకునేందుకు అవసరమైన యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తూ బడా భీంగల్ గ్రామంలోని...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ…

0
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ  నియోజకవర్గ అభివృద్ధి పై చర్చ   సీఎం ను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ...

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

Translate »
error: Content is protected !!