Homeఆరోగ్యంజర్నలిస్టుల కుటుంబాలకు ‘వెల్నెస్’ భరోసా నిజామాబాద్‌లో ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ!

జర్నలిస్టుల కుటుంబాలకు ‘వెల్నెస్’ భరోసా నిజామాబాద్‌లో ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ!

*జర్నలిస్టుల ఆరోగ్యానికి ‘వెల్నెస్’ భరోసా!*

*నగర ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డుల పంపిణీ*

*ముఖ్య అతిథులుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ కవితా రెడ్డి.**

*జర్నలిస్టుల సంక్షేమానికి వెల్నెస్ హాస్పిటల్ ముందడుగు.*
*రాష్ట్రవ్యాప్తంగా 8 బ్రాంచ్‌లతో కార్పొరేట్ వైద్యం: ఎండీ అసద్. సుమన్ గౌడ్**

నిజామాబాద్ సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు వెల్నెస్ హాస్పిటల్ అండగా నిలిచింది. బుధవారం నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో నిజామాబాద్ నగర ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి (DPRO) పద్మశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

*ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: శ్రీనివాస్ రెడ్డి**

ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వృత్తి రీత్యా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జర్నలిస్టుల కుటుంబాల కోసం ఉచిత హెల్త్ కార్డులు పంపిణీ చేయడం అభినందనీయమని వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యాన్ని కొనియాడారు. ప్రభుత్వం జారీ చేస్తుందా అట్రిడిటేషన్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా, ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా, అందరికీ కార్డులు అందేలా రాష్ట్ర కమిటీ, ప్రభుత్వంతో మాట్లాడటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు..

*డాక్టర్ కవితా రెడ్డి* *మాట్లాడుతూ..*

వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండాలని, జర్నలిస్టులకు కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించడం శుభపరిణామమని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

*విస్తరిస్తున్న వెల్నెస్ సేవలు: ఎండీ అసద్**

ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అసద్ మాట్లాడుతూ.. 2018లో అమీర్‌పేటలో మొదటి బ్రాంచ్‌తో ప్రారంభమైన వెల్నెస్ హాస్పిటల్, నేడు రాష్ట్రవ్యాప్తంగా 8 బ్రాంచ్‌లతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఈ హెల్త్ కార్డుల ద్వారా అత్యుత్తమ చికిత్సలు పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు.

*అట్టహాసంగా కార్యక్రమం..**

ఈ కార్యక్రమంలో వెల్నెస్ ఆసుపత్రి ప్రతినిధులు సుమన్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ భార్గవ్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగర ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్, క్యాషియర్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు, ఉపాధ్యక్షులు సంగీత, సతీష్, గోవింద రాజులు, సురేష్ తదితరులు అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరో చీఫ్‌లు, స్టాఫ్ రిపోర్టర్లు, ఎడిటర్లు, ఫోటో మరియు వీడియో జర్నలిస్టులు, నగర జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని హెల్త్ కార్డులను అందుకున్నారు.

> **జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం:**

> ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. 

సంఘాలకు అతీతంగా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, జర్నలిస్టులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన తన వాగ్దానాన్ని పూర్తి చేశారని, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, దీనికి సహకరించిన వెళ్లే ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలనని భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సీతారాంపూర్‌ పాఠశాలకు టీవీ అందజేత…

0
సీతారాంపూర్‌ పాఠశాలకు టీవీ అందజేత డిజిటల్‌ తరగతులు, వీడియో పాఠాలకు ఉపయోగం: సర్పంచ్‌ సంజీవ్‌ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ మండలం సీతారాంపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు గ్రామ సర్పంచ్‌ నత్తి సంజీవ్‌, వార్డు...

రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు…

0
రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు భక్తులతో కిటకిటలాడిన ఆలయం.. అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం రామారెడ్డి: మండలంలోని ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు అత్యంత...

ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ…

0
ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ మోబిన్సాబ్‌, ఎస్బీ తండాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి: ధర్పల్లి మండలంలో...

మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన…

0
మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ఆర్‌ఓబీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్‌... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం: మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి...

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి సీతక్క…

0
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి సీతక్క అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు మంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లిన కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే...

Translate »
error: Content is protected !!