దత్తత హెల్ప్ డెస్క్ ప్రారంభించిన జిల్లా అడిషనల్ కలెక్టర్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక బాలల భద్రత డ్రగ్స్ రహిత తెలంగాణ వరసలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో( ఐడిఓసి) దత్తత సహాయ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పోర్టల్ ద్వారా పిల్లల అడాప్షన్ ప్రక్రియ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అక్రమ దత్తత తీసుకున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టరేట్ ప్రాంగణంలో వచ్చే ప్రజలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రియను కావాల్సిన పత్రాలను మరియు ప్రభుత్వ మార్గదర్శకాలను అందజేయాలని సూచించారు అనంతరం హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి దంపతులకు అబ్బాయిని దత్తత ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్ ,జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్ కార్యాలయం సిబ్బంది అనిత అనిల్ ముజాహిద్ స్రవంతి గణేష్ తదితరులు పాల్గొన్నారు.























