Homeతెలంగాణఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్, మే 01 : తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడ లో గల షెడ్యూల్డు కులాల వసతి గృహంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫౌండేషన్ కోర్సును కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటివరకు 10 బ్యాచ్ లలో 800 మందికి శిక్షణ అందించగా, వారిలో 199 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం 11వ బ్యాచ్ లో 93 మంది ఫౌండేషన్ కోర్సులో చేరారని, వీరికి ఐదు నెలల పాటు ఉచిత భోజన వసతి సదుపాయాలతో నాణ్యమైన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. వారి విద్యాభివృద్ధికి కూడా ఎనలేని ప్రాధాన్యతనిస్తూ, పోటీ పరీక్షలలో ప్రతిభను కనబర్చి ఉద్యోగ అవకాశాలు పొందేలా స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఉచితంగా శిక్షణ అందిస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని సరైన విధంగా వినియోగించుకుంటే, ఆశించిన విధంగా ప్రభుత్వ కొలువు దక్కించుకోవచ్చని, భవిష్యత్తు ఎంతో బాగుంటుందని హితవు పలికారు. సమయాన్ని వృధా చేయకుండా, గట్టి సంకల్పంతో కృషి చేయాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఏకాగ్రతతో కష్టపడి చదవాలని కర్తవ్యాన్ని బోధించారు. ఆంగ్లంలో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు. వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కాకముందు నుండే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని మార్గనిర్దేశం చేశారు. అంతకుముందు కలెక్టర్ వసతి గృహంలోని గదులు, కిచెన్ తదితర వాటిని సందర్శించి భోజన, వసతి సదుపాయాలు పరిశీలించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోసం పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి రజిత, సహాయ అధికారి రాజ గంగారాం, స్టడీ సర్కిల్ డైరెక్టర్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

Translate »
error: Content is protected !!