భగత్ సింగ్ కాలనీలో రోడ్డు పనులపై ప్రజల నిరసన
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం భగత్ సింగ్ కాలనీలో గత రెండేళ్లుగా ప్రధాన రహదారి అయిన బైపాస్ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండటంతో కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మధ్యలో పెద్ద రాళ్లు, నిలిచిపోయిన డ్రైనేజీల వల్ల దోమల బెడదతో అనారోగ్యం పాలవుతున్నామని, ఎన్నికల సమయంలోనే నాయకులు కనిపిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ కు డబ్బులు అందలేదా, అందుకే పనులు చేయడం లేదా అని ప్రశ్నిస్తూ, సర్పంచ్ తమ కాలనీని పరిశీలించి సమస్యలు తెలుసుకోవాలని కోరారు.























