ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు.. అధికారులతో ఎమ్మార్వో శాంత చర్చ
శుక్రవారం : 01/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా పడి ఉందని, వాటి కొనుగోలుపై జిల్లా అధికారులతో మాట్లాడినట్లు ఎమ్మార్వో శాంత గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దొడ్డు రకం ధాన్యం కొనుగోలులో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరిస్తున్నామని అధికారులు హామీ ఇచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో కొనుగోలు చేపడతామని, రైతుల నుంచి దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయాలని వినతులు వస్తున్నాయని ఆమె వివరించారు.























