సీతాయిపేట్లో వైభవంగా విగ్రహ ప్రతిష్ట
శనివారం : 09/05/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం, ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సర్పంచ్ భూమేష్ దంపతులు, మాజీ సర్పంచ్ లక్కిడి రాములు, ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.























