Homeఇందూరుఅంగవైకల్యం భారం కాదు..  వారికి ఏదో ఒక ప్రతిభ ఉంటుంది... దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ...

అంగవైకల్యం భారం కాదు..  వారికి ఏదో ఒక ప్రతిభ ఉంటుంది… దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే..

అంగవైకల్యం భారం కాదు 

 వారికి ఏదో ఒక ప్రతిభ ఉంటుంది..

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే..

ఇందూరు: అంగవైకల్యం భారం కాదని, వారికి సేవ చేసే భాగ్యంగా భావించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. సమగ్ర శిక్ష, విద్యాశాఖ, అలింకో సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పిల్లలకు అంగ వైకల్యం ఉందని బాధపడొద్దన్నారు. భవిత కేంద్రాల్లో అందజేస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అంగ వైకల్యం ఉన్న విద్యార్థులకు భగవంతుడు ఏదో ఒక ప్రతిభను ఇస్తాడన్నారు. లూయిస్ బ్రెయిలీ, అంద సంగీత మేధావి రవీంద్ర జైన్, దివ్యాంగ నృత్య కళాకారిని సుధాచంద్రన్ లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉపకరణాలను అందజేయడంతో పాటు భవిత కేంద్రాలను నిర్మిస్తుందని చెప్పారు. సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి వికలాంగుల పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని పేర్కొన్నారు. అలాగే కొత్త పెన్షన్లను కూడా అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేకసార్లు మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి లేఖనందిస్తానని తెలిపారు. అనంతరం 393 మంది విద్యార్థులకు 34 లక్షల విలువ గల ఉపకరణాలను అందజేశారు. అంతకుముందు నూతనంగా నిర్మించిన భవిత కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డిఇఓ అశోక్, ఎంఈవో లు సాయారెడ్డి, ఎన్ఆర్ గౌడ్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, ఆ లింకో ప్రతినిధులు డాక్టర్ ప్రత్యూష్, 39 వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి మురళి, బీజేపీ నాయకులు ప్రభాకర్ పవన్ ముందడ, కైరం కొండ మురళి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

0
ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ...

Translate »
error: Content is protected !!