హెచ్ఐవి సోకిన వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి
జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ART మందులు క్రమంతప్పకుండా వాడాలి అని
అదనపు జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థలు దిలీప్ కుమార్ తెలియజేయడం
జరిగింది. ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైతే హెచ్ఐవి సోకిన వారు క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన అవసరం ఉందని ,అలా వాడిన వారికి వైరల్ లోడ్ క్రమంగా తగ్గి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. ‘మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష ‘లో మన జిల్లా లో నూటికి 92 శాతం ఉన్న వైరల్ లోడ్ శాతాన్ని డిసెంబర్ ఒకటవ తేదీ వరకు 99 శాతంగా మార్చడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి రాజశ్రీ, అదనపు జిల్లా వైద్యాధికారి ఎయిడ్స్& లెప్రసీ డాక్టర్ దేవి నాగేశ్వరి ఏ ఆర్ టి సెంటర్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, డిపిఎం సుధాకర్ , సహాయోగి సమత, అలాగే ఐసిటిసి కౌన్సిలర్లు ఎఆర్టి కౌన్సిలర్, డేటా మేనేజర్లు పాల్గొన్నారు.

























