మాతృ మరణాలను తగ్గించండి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మాతృ మరణాలపై సమీక్ష కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎం సి హెచ్ సూపర్వైజర్లు ప్రతి గర్భిణీ స్త్రీ ని 12 వారాల లోపు నమోదు చేయడమే కాకుండా నాలుగు సార్లు వైద్యుల చేత పరీక్షించేలా చూడాలని ధనుర్వతము రాకుండా టీకాలు ఇప్పించాలని ఒకవేళ ఎవరైనా ప్రమాదకరమైన లక్షణాలున్నట్లయితే వారిని ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీని ఎత్తు, బరువు, బీపీ, హెచ్ బి,రక్తహీనత మొదలగు పరీక్షలతో పాటు హైపర్ టెన్షన్, ప్లేట్లెట్స్ పరీక్షలు నిర్వహించి నివారణ లో భాగంగా ముందస్తు ప్రణాళిక రచించాలని తెలియజేశారు. సాధారణ ప్రసవాలకై తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రమాదకరమైన లక్షణాల గర్భిణీ స్త్రీలను స్త్రీ వైద్య నిపుణులు ఉండే ఆసుపత్రులకు ప్రసవాలకై ప్రణాలిక రచించాలన్నారు. ఆశా కార్యకర్తలు గర్భిణీ స్త్రీలు ప్రసవానికి వెళుతున్నప్పుడు వారి వెంట తప్పకుండా వెళ్లాలని సాధారణ ప్రసవాలు అయ్యే విధంగా వారికి తగు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మదర్ ఇన్ మదర్ అవుట్ గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫోన్ ద్వారా వారికి అందించే ఆరోగ్య సేవలను గుర్తించి నమోదు చేయాలని అన్నారు. ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ఎల్ఎంపీని మరియు
ఈడీడీ లను కరెక్ట్ గా నమోదు చేయాలని అన్నారు. ఏ ఒక్క మాతృ మరణం జరగకుండా అన్ని విధాల కృషి చేయాలని, అనివార్య కారణాలవల్ల ఎక్కడైనా మాతృ మరణం సంభవిస్తే పూర్తి సమాచారాన్ని అంటే గర్భిణీ స్త్రీ ఇంటి నుండి బయలుదేరి ఎక్కడెక్కడ ఏ రకమైన చికిత్స తీసుకున్నది ఏ లక్షణాల కొరకై ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేయబడ్డది, డాక్యుమెంటేషన్ వివరాలను సేకరించాలని ఆసుపత్రి స్థాయిలో ఆడిట్ ను మరియు సామాజిక స్థాయిలో ఆడిట్ ను నిర్వహించి మాతృ మరణాలు నమోదు ఫార్మాట్ నందు పూర్తి సమాచారాన్ని పొందుపరచాలని కోరారు. గర్భిణీ స్త్రీ ఇంటి వద్ద కుటుంబ సభ్యుల ద్వారా గాని లేదా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల గాని లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వల్ల గాని,ఏ ఒక్క మాతృ మరణం జరగకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ సమీక్షలో మాతృ మరణాలు జరిగిన నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మోస్రా, పెగడపల్లి, ఇందల్వాయి , చౌట్ పల్లి, నుండి సిబ్బంది పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ , జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ రవీందర్ , డాక్టర్ సికందర్ నాయక్ , డాక్టర్ సమత,
స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ అరుణ రేఖ, అనస్థీషియా డాక్టర్ అనిల్ కుమార్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శిఖరా ,డాక్టర్ సుప్రియ, ఏస్ వో రాజేశ్వర్, డి.హెచ్.ఇ వెంకటేశ్వర్లు , వివిధ పీహెచ్సీల నుండి వైద్యాధికారులు, ఎం ఎల్ హెచ్ పి లు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

























