జూన్ 2న ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ కార్టులు!
May 19, 2026, నూతన ఈహెచ్ఎస్ (EHS) పథకం కోసం ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలను పోర్టల్లో అప్డేట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాలను ఆదేశించింది. ఈనెల 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక శాఖ సూచించింది. జూన్ 2న ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈహెచ్ఎస్ వివరాల సేకరణకు ఆదేశాలు జారీ అయ్యాయి.























