Homeఆరోగ్యంపట్టణ ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

పట్టణ ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

పట్టణ ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

నిజామాబాద్ నగరంలోని సీతారాం నగర్ కాలనీ లో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రం ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని , గర్భిణీ స్త్రీల నమోదును, 12 వారాల లోపు చేయాలని, ప్రతి గర్భిణీ స్త్రీ నాలుగు సార్లు వైద్యని చేత ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించాలని, ప్రతి గర్భిణీ స్త్రీ కి రక్త హీనత, పోషకాహారం పై అవగాహన కలిగించాలని అన్నారు. అదేవిధంగా ప్రమాదకర లక్షణాలను గల గర్భిణీ స్త్రీలను ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించాలన్నారు. రెండవ అంతకంటే ఎక్కువ సార్లు గర్భం దాల్చిన మహిళలకు కుటుంబాన్ని తాత్కాలిక మరియు శాశ్వత పద్ధతులపై అవగాహన కలిగించి బిడ్డకు బిడ్డకు మధ్య మూడు సంవత్సరాలు ఎడం ఉండేలా అవగాహన కలిగించాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం అయ్యేలాగా ప్రసవ ప్రణాళికను తయారు చేయాలన్నారు. గర్భిణీ సమయంలో మదర్ ఇన్ లేదా మదర్ అవుట్ జరిగితే ఫోన్ ద్వారా సమాచారాన్ని అక్కడ అమ్మవారి ఇంటి వద్ద గాని మరెక్కడ గాని పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సమాచారం అందించి పర్యవేక్షించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అదేవిధంగా వేరే ప్రాంతాల నుండి ఇక్కడ ఎవరైనా గర్భిణీలు ప్రసాదం కోసం తల్లి గారి ఇంటి వద్దకు వచ్చిన అదే పద్ధతిలో ఇక్కడ కూడా వారి యొక్క ఆరోగ్య క్షేమ సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండాలన్నారు అప్పుడే మాతా శిశు మరణాలు జరగకుండా అరికట్టవచ్చు అని తెలియజేశారు. ప్రసవం జరిగిన వెంటనే గంటలోపు తల్లియొక్క ముర్రూ పాలను తాగించాలని, మరియు వ్యాధి నిరోధక పట్టీకాలను సకాలంలో జాతీయ

ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారంగా ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుత సీజన్ లో ఎదురయ్యే ప్రజారోగ్య సమస్యలైన వడదెబ్బ మొదలగు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సరిపడా మందులను ఉంచుకోవాలని ముఖ్యంగా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఉన్నటువంటి చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయోవృద్ధులు, మరియు ఇతర దీర్ఘకాల వ్యాధుల వారిని మరియు ఆరుబయట మండుటెండలో పనిచేసే కూలీల ను ప్రత్యేక శ్రద్ధతో వడిదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్ను, ఓపి రిజిస్టర్ ,మందుల స్టాకు రిజిస్టర్ వివిధ రకాల రిజిస్టర్ లను రిపోర్టులను తనిఖీ చేశారు. ఉద్యోగులందరూ సమయపాలన పాటించి సమయానికి హాజరుకావాలని నియమ నిబంధనలు ఉల్లంఘించి విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులకు శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉపకేంద్ర పరిధిలో కేటాయించినటువంటి లక్ష్యాలను 100% పూర్తి చేయాలని ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని కోరారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని వివిధ శాఖల అనగా మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖ వారి సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తున్నందుకు అక్కడి సిబ్బందిని అభినందించారు. తనిఖీ సమయంలో ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ ప్రత్యూష , పీహెచ్ఎన్ ప్రమీల రాణి, ఏఎన్ఎంలు ఆశాలు ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!