Homeఆరోగ్యంప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా...

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా…

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా…

మరమ్మతులు, పరిశుభ్రత, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఇందూరు: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆసుపత్రిలోని ప్రతి విభాగాధిపతి, వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా వైద్యుల హాజరు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఆసుపత్రిలో సివిల్ వర్క్స్‌కు సంబంధించిన పలు సమస్యలు ఉన్నాయని, మరమ్మతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ల్యాబ్, ఎక్స్‌రే తదితర పరీక్షల కోసం వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

కొంతమంది కింది స్థాయి సిబ్బంది రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రతి విభాగాధిపతి తమ సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

అధికారులు, వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వచ్చే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నాటికి పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఆసుపత్రి పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కులగాయల ఉమారాణి, డీఎంహెచ్‌వో డా. రాజశ్రీ, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాములు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...

వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్…

0
వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు…

0
ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో పిచ్చికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు...

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్…

0
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడిన ఆరుగురు నిందితులు అరెస్ట్.. కాపర్ కాయిల్స్, వాహనాలు, చోరీకి ఉపయోగించిన...

Translate »
error: Content is protected !!