నేడు ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ ప్రారంభం..
తెలంగాణ : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (EHS)ను శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్త ఈహెచ్ఎస్ పోర్టల్, హెల్త్‌కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. కాగా ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈహెచ్ఎస్ అమలును ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్టుకు అప్పగించింది. ఈహెచ్ఎస్ నిధులు ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సేవలకే వినియోగించాలని నిర్ణయించింది.























