మందుబాబులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు!
తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయి. దీనిపై నేడో, రేపో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మద్యం తయారీ సంస్థల విజ్ఞప్తులు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను పరిశీలించిన త్రిసభ్య కమిటీ ధరల పెంపును సిఫారసు చేయగా, ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. దాదాపు 20 శాతం వరకు ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. చీప్, మీడియం, ప్రీమియం, హయ్యర్ క్యాటగిరీ అన్ని బ్రాండ్లపై పెంపు ఉండనుంది. ప్రీమియం ఫుల్ బాటిళ్లపై రూ.100 వరకు, హయ్యర్ క్యాటగిరీపై రూ.120 వరకు, చీప్ లిక్కర్‌పై రూ.90 వరకు పెరగొచ్చని అంచనా.























