పదవులు అడుక్కోను.. నేనొక ఫైటర్: రాజగోపాల్ రెడ్డి…
తెలంగాణ : తాను పదవులు అడుక్కునే రకం కాదని, తాను ఒక ఫైటర్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, పార్టీకి తన సేవలను ఎలా ఉపయోగించుకోవాలో అలా వాడుకోవాలని చెప్పడానికే కలిశానని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు. శనివారం గాంధీ భవన్లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.























