అంగన్వాడీలకు సోలార్ విద్యుత్ సదుపాయం: భట్టి విక్రమార్క ఆదేశాలు…
తెలంగాణలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించేందుకు వెంటనే కార్యాచరణ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూమి కొరత ఉన్న హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఫ్లైఓవర్ల కింద సబ్స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. 108 తరహాలో విద్యుత్ సమస్యలను వేగంగా పరిష్కరించే ‘పవర్ అంబులెన్స్’ సేవలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.























